డ్రయ్ సోఇంగ్ / నీరు లేకుండా వ్యవసాయం / Dry Sowing / Pre Monsoon Sowing:
సేకరించాల్సినవి లేదా కొనుక్కోవాల్సినవి:
- విత్తన సేకరణ
- శనగకాయల పొట్టు సేకరణ
- ఏక దళ లేదా ద్విదళ పంటల వ్యర్దాలు లేదా ఇతర ఆకుల సేకరణ
- బంక మట్టి లేదా పుట్టమన్ను సేకరణ
తయారుచేయాల్సినవి:
- ఘనజీవామ్రుతం తయారి (ముందుగా)
- బీజామ్రుతం తయారి (ముందుగా)
- ద్రవజీవామ్రుతం తయారి (ముందుగా అవసరం లేదు )
- అటవీ చైతన్య ద్రావకం (తప్పనిసారి కాదు)
స్టెప్స్ః
- బీజామ్రుతం తో విత్తన శుద్ధి
- విత్తనాలను ఆరబెట్టాలి
- విత్తనాలను బంక మన్నులో కలపాలి
- నేల దున్నుకోవాలి
- ఘన జీవామ్రుతం చల్లుకోవాలి
- విత్తనాలు చల్లుకోవాలి
- మల్చింగ్ లేయర్ 1
- మల్చింగ్ లేయర్ 2
- ద్రవజీవామ్రుతం పిచికారి
- అటవీ చైతన్య ద్రావకం పిచికారి
సేకరించాల్సినవి లేదా కొనుక్కోవాల్సినవి:
- విత్తన సేకరణ: విత్తనాలు ఒక 9 నుంచి 15 రకాల విత్తనాలు తీసుకోవాలి (దేశీ రకం మాత్రమే హైబ్రీడ్ వద్దు) . అన్ని రకాలు కలిపి ఒక 4 నుంచి 5 కిలోల వరకు (సుమారుగా) ఒక ఎకరానికి కావాలి . కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అయినా పర్లేదు. అన్ని రకాల ఏకదళాలు, ద్విదళాలు తీసుకోవచ్చు. కొన్ని కూరగాయల విత్తనాలు కూడా ఇందులో కలపవచ్చును. క్రింద పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
- సజ్జలు
- రాగులు
- గోధుమలు
- ఉలవలు
- అలసందలు
- పెసలు
- జొన్నలు
- కొర్రలు
- మినుములు
- శనగలు
- ఆముదం
- శనగకాయల పొట్టు సేకరించాలి: సుమారు 200కిలోలు మొదటి స్థాయి మల్చింగ్ కోసం.
- ఏక దళ లేదా ద్విదళ పంటల వ్యర్దాలు లేదా ఇతర ఆకులు సేకరించాలి: సుమారు 100కిలోలు. రెండవ స్థాయి మల్చింగ్ కోసం.
- బంక మట్టి లేదా పుట్టమన్ను: (స్టెప్ ౩లో) ఇది విత్తనాలను చుట్టుకోవడం/కలుపుకుని ఉండలుగా చేసుకోవడం కోసం. మెత్తగా మట్టిని చేసుకుని బురదగా నీల్లు కలుపుకుని ఉంచుకోవాలి. మరీద్రవం గా కాకుండా మరీ ఘనంగా కాకుండా చేసుకోవాలి.
తయారుచేయాల్సినవిః
- ఘనజీవామ్రుతం తయారి (ముందుగా): ఎకరానికి 100 నుంచి 200 కిలోలు సిద్దం చేసుకోవాలి. సగం ఘనజీవామ్రితం సగం పశువుల పెంట కూడా కలిపి వాడవచ్చు. ఘనజీవామ్రుతం పూర్తిగా ఉంటే బాగుంటుంది. మొత్తం కలిపి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి.
- బీజామ్రుతం తయారి (ముందుగా): ఒక రోజు ముందుగానే చేసుకుని పెట్టుకోవాలి. బీజామ్రుతం చేసిన తర్వాత 12గంటలు ఉండాలి మరియు 48గంటల లోపు వాడుకోవాలి. కాబట్టి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి.
- ద్రవజీవామ్రుతం తయారి (ముందుగా అవసరం లేదు ): ప్రతి పదిహైను రోజులకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది.
- అటవీ చైతన్య ద్రావకం (తప్పనిసారి కాదు): ఒక వేళ దొరికినట్టు అయితే అటవీ చైతన్య ద్రావకం చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. తప్పనిసరి కాదు ఉంటే బాగుంటుంది.
స్టెప్స్ః
- బీజామ్రుతం తో విత్తన శుద్ధి: విత్తనాలను బీజామ్రుతం తో శుద్ధి చేయాలి. ఇందులో భాగంగా విత్తనాలను బీజామ్రుతం లో కడిగినట్టు చెయ్యాలి. బీజామ్రుతం అన్ని విత్తనాలకు బాగా పట్టేటట్టు చెయ్యాలి.
- విత్తనాలను ఆరబెట్టాలి: శుద్ధి చేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టాలి.
- విత్తనాలను బంక మన్ను లో చుట్టుకోవాలి: ఆరబెట్టిన విత్తనాలను బంక మన్ను లో చుట్టుకోవాలి. దీనికోసం మెత్తగా మట్టిని చేసుకుని బురదగా నీల్లు కలుపుకుని ఉంచుకోవాలి. మరీద్రవం గా కాకుండా మరీ ఘనంగా కాకుండా చేసుకోవాలి. ప్రతీ విత్తనానికి మట్టి పూర్తిగా అంటేట్టు చూడాలి. అప్పుడే విత్తనాలను పక్షులనుండి కాపాడుకోగలం.
- నేల దున్నుకోవాలి: ఎద్దులతో దున్నుకుంటే బాగుంటుంది. కుదరక పోతే ఎదైన యంత్రాలద్వారా చేసుకోవచ్ఛు. భూమి అంతా మెత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. మీకు డ్రిప్ సౌకర్యం ఉంటే దానికి తగ్గట్టు బెడ్స్ లా చేసుకోవచ్చు. కాని డ్రిప్ అవసరం అంత ఉండదు. అవసరం అనుకుంటే మధ్యల నడవడానికి మరియు నీరు పారడానికి చిన్న కాలువలు చేసుకోవచ్ఛు. మీకు వర్షాలు పడవు అనుకుంటే ఇది అక్కర్లేదు.
- ఘన జీవామ్రుతం చల్లుకోవాలి: ఎకరానికి 100 నుంచి 200 కిలోలు సిద్దం చేసుకోవాలి. సగం ఘనజీవామ్రితం సగం పశువుల పెంట కూడా కలిపి వాడవచ్చు. ఘనజీవామ్రుతం పూర్తిగా ఉంటే బాగుంటుంది. మొత్తం కలిపి మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి. ఈ మెత్తటి ఘనజీవామ్రితం పొడిని పొలంలో మొత్తం చల్లాలి.
- విత్తనాలు చల్లుకోవాలి: ఇప్పుడు విత్తనాలను అంతటా సమానంగా చల్లుకోవాలి. ఎటువంటి పరికరాలు లేకుండా చేతితోనే చల్లుకోవచ్ఛు. బెడ్స్ చేసుకుంటే ఆ బెడ్స్ మీదనే చల్లుకోవాలి.
- మల్చింగ్ లేయర్ 1: విత్తనాలు చల్లిన తరువాత శనగకాయ పొట్టుతో నేల మొత్తం మూసుకుపొయేట్టు చల్లాలి.
- మల్చింగ్ లేయర్ 2: ఇప్పుడు రెండవ లేయర్ గా సేకరించిన గడ్డి లేదా ఇతర పంటల వ్యర్దాలు లేదా ఇతర ఆకులు చల్లుకోవాలి. ఇలా చెయ్యడం వలన మొదటి లేయర్ లో వేసిన పొట్టు ఎగిరిపోకుండా వుంటుంది. కొంత మట్టి లేదా ఆవు పేడ కూడా చల్లుకోవచ్ఛు.
- ద్రవజీవామ్రుతం పిచికారి: ప్రతి 15రోజులకు ఒకసారి ద్రవజీవామ్రుతం పిచికారి చేయాలి.
- అటవీ చైతన్య ద్రావకం పిచికారి: ప్రతి 15రోజులకు ఒకసారి అటవీ చైతన్య ద్రావకం పిచికారి చేయాలి. అంటే ఒక వారం ద్రవజీవామ్రుతం ఒక వారం అటవీ చైతన్య ద్రావకం పిచికారి చేయాలి.
- ఇతర పిచికారీలు: అవసరాన్ని బట్టి ఇతర ద్రావకాలు లేదా కషాయాలు పిచికారి చేసుకోవచ్ఛు. వర్షాలు బొత్తిగా లేకపోతే పిచికారీల ద్వారా కూడా నీటిని అందించవచ్చు.